హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉద్యోగాల పేరుతో మోసం.. 9 మంది బాధితులు!

SRPT: మఠంపల్లి మండలంలో ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. పెదవీడుకు చెందిన నరేశ్‌ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నకిలీ ఆఫర్‌ లెటర్లు ఇచ్చి 9 మంది నుంచి ఒక్కొక్కరి వద్ద రూ.40 వేలు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. బాధితుల్లో నల్గొండ, హైదరాబాద్‌కు చెందినవారు ఉన్నట్లు సమాచారం. నరేష్‌పై చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.