హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎమ్మెల్యే‌కు రైతుల వినతి

MBNR: సాగునీటి కాలువ నిర్మాణంలో భూములు కోల్పోయిన తమకు నష్టపరిహారం అందించాలని వెంకటగిరి రైతులు స్థానిక ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. కాలువ నిర్మాణం వల్ల తాము ఆర్థికంగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే..అధికారులతో మాట్లాడి బాధితులకు త్వరలోనే పరిహారం అందేలా చూస్తానని హామీ ఇచ్చారు.