NLR: కందుకూరు పట్టణంలోని నాంచారమ్మ కాలనీలో గురువారం సీఐ జగదీష్ ఆధ్వర్యంలో పోలీసులు కార్డాన్ సెర్చ్ నిర్వహించారు. ఎస్సైలు భార్గవ్, మరిడి నాయుడు, సిబ్బంది ప్రతి ఇంటినీ తనిఖీ చేసి వాహనాల పత్రాలను పరిశీలించారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాల వినియోగంతో కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
కందుకూరులో పోలీసుల కార్డాన్ సెర్చ్


