హైదరాబాద్: 28°C
తెలంగాణ

సంతాన లక్ష్మీదేవి అవతారంలో అమ్మవారు

ఖమ్మం నగరంలోని శ్రీ స్తంభాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ గుట్టపై శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఐదో రోజైన గురువారం అమ్మవారిని సంతాన లక్ష్మీదేవి అవతారంలో అలంకరించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి పాలు, పెరుగు తదితర పవిత్ర ద్రవ్యాలతో విశేష అభిషేకాలు చేయగా.. అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు.