హైదరాబాద్: 28°C
తెలంగాణ

యాసంగిలో ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యం: ఎమ్మెల్యే

ఆసిఫాబాద్‌లో నిర్వహించిన రైతు మేళాలో సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు మాట్లాడుతూ, రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంబించాలని సూచించారు. నీటిని పొదుపుగా వినియోగిస్తూ యాసంగిలో ఆరుతడి పంటలు సాగు చేయాలన్నారు. వ్యవసాయ యాంత్రీకరణను ప్రోత్సహిస్తూ, వాతావరణ మార్పులకు అనుగుణంగా పంటల సాగులో మార్పులు చేసుకోవాలని కోరారు.