హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

హరిపురంలో ఫుడ్ సేఫ్టీ తనిఖీలు

SKLM: మందస మండలం హరిపురంలో గురువారం ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. హోటళ్లు, కిరాణా దుకాణాలు, బేకరీల్లో ఆహార పదార్థాల నాణ్యత, గడువు తేదీలను పరిశీలించి, నమూనాలను ల్యాబ్‌కు పంపించారు. ఫుడ్ లైసెన్స్ లేని దుకాణాలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలకు నాణ్యమైన ఆహారం అందేలా తనిఖీలు కొనసాగిస్తామని తెలిపారు.