హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాధ్యతలు స్వీకరించిన నూతన ఎస్‌హెచ్‌ఓ

BDK: అశ్వారావుపేట పోలీస్ స్టేషన్ నూతన ఎస్‌హెచ్‌ఓగా సాయి కిషోర్ రెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు. శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, గంజాయి అక్రమ రవాణా అరికట్టడం, రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రాధాన్యమిస్తానని తెలిపారు. ప్రజలు తమ సమస్యలను పోలీసుల దృష్టికి తీసుకురావాలని, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.