హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చించినాడ బ్రిడ్జి బంద్‌తో ప్రయాణికుల అవస్థలు

W.G: చించినాడ బ్రిడ్జిని 24 గంటల పాటు మూసివేయడంతో ఉభయ గోదావరి జిల్లాల మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రయాణికులు నరసాపురం-సఖినేటిపల్లి మార్గాన్ని ఆశ్రయిస్తున్నారని స్థానికులు తెలిపారు. మాధవాయిపాలెం రేవు వద్ద స్టీమర్లు, పడవల కోసం భారీగా బారులు తీరారు. వాహనాల రద్దీతో ట్రాఫిక్ స్తంభించడంతో ప్రయాణికులు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందన్నారు.