హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అవనిగడ్డలో అబ్దుల్ కలాం జయంతి వేడుకలు

కృష్ణా: అవనిగడ్డలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. గురువారం టీడీపీ కార్యాలయంలో నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సాధారణ కుటుంబంలో పుట్టి అత్యున్నత పదవికి ఎదిగిన కలాం జీవితం ఆదర్శప్రాయమని, దేశ శాస్త్ర సాంకేతిక అభివృద్ధికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని, యువత ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు.