నంద్యాల కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో మున్సిపాలిటీలు, నగర పంచాయతీల ఎన్నికల నిర్వహణపై కలెక్టర్ జి.రాజకుమారి ఎన్నికల అధికారులతో ఇవాళ సమీక్ష నిర్వహించారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని, అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. ఎన్నికల విధివిధానాలు, నిబంధనలపై పూర్తి అవగాహనతో బాధ్యతలు నిర్వర్తించాలని ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికల నిర్వహణపై అధికారులకు కలెక్టర్ దిశానిర్దేశం


