హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కొండపిలో ఓ మోస్తారు వర్షం

ప్రకాశం: కొండపిలో గురువారం ఒక్క సారిగా వాతావరణంలో మార్పు వచ్చి ఆకస్మికంగా వర్షం కురిసింది. గత నాలుగు రోజులుగా తీవ్రస్థాయిలో ఉన్న ఎండలతో ప్రజలు పలు ఇబ్బందులు పడ్డారు. ఉక్కపొతతో ప్రజలు అల్లాడారు. గురువారం వాతావరణంలో మార్పు సంభవించి ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. అనంతరం వర్షం కురవడంతో ఎండ వేడి నుంచి ప్రజలకు ఉపశయనం లభించినట్లు అయ్యింది.