BDK: ఆన్లైన్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అశ్వాపురం ఎస్సై బి.శాంతి సూచించారు. సీఐ ఎల్లయ్య ఆదేశాల మేరకు గురువారం మండల కేంద్రంలోని బస్టాండ్ సెంటర్ వద్ద సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సైబర్ నేరాల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, సందేశాలు, లింకు పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.
తెలంగాణ
'ఆన్లైన్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'


