హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఇంద్రకీలాద్రిపై పోటెత్తిన భక్తులు

NTR: ఇంద్రకీలాద్రిపై గురువారం తెల్లవారుజాము నుంచి 30,067 మంది భక్తులు కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. రద్దీతో దర్శనానికి సుమారు గంటన్నర సమయం పడుతోందని భక్తులు చెబుతున్నారు. క్యూలైన్లలో భక్తులకు మంచినీరు, పాలు, బిస్కెట్లు అందిస్తున్నారు. 2,399 మందికి అన్నప్రసాదం పంపిణీ చేయగా, 47,394 లడ్డూలు విక్రయించారు. 146 మంది చిన్నారులకు చైల్డ్ లైన్ ట్యాగ్‌లు వేశారు.