హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: దుర్గమ్మకు రూ.75 లక్షల స్వర్ణ కిరీటం కానుక

NTR: విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మకు శ్రీకాకుళానికి చెందిన కె. దుర్గా శ్రీనివాస్ గురువారం రూ.75 లక్షల విలువైన స్వర్ణ కిరీటాన్ని సమర్పించారు. నవరత్నాలు పొదిగిన 494 గ్రాముల కిరీటాన్ని ఆలయ ఈవో వి.కె. శీనా నాయక్, చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ వి. త్రినాథరావుకు అందజేశారు. అనంతరం దాత కుటుంబానికి అంతరాలయ దర్శనం కల్పించారు.