హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్ట్రాంగ్ రూమ్‌లను పరిశీలించిన డీఎస్పీ

KDP: ఎర్రగుంట్ల మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జమ్మలమడుగు డీఎస్పీ కె. వెంకటేశ్వరరావు, సీఐ విశ్వనాథ్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ శేషఫణి సమన్వయ సమావేశం నిర్వహించారు. అనంతరం స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ హాళ్లను పరిశీలించి, ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.