హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఓటరు నమోదు ప్రక్రియ పరిశీలించిన అడిషనల్ కలెక్టర్

MNCL: బెల్లంపల్లి మున్సిపాలిటీ 31వ వార్డ్ లో సర్ ప్రక్రియలో భాగంగా బూత్ నెంబర్ 86, 88ల్లో నూతన ఓటరు నమోదు కార్యక్రమం గురువారం నిర్వహించారు. జిల్లా అడిషనల్ కలెక్టర్ చంద్రయ్య, MRO కృష్ణ లు సందర్శించి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను పరిశీలించారు. వారు మాట్లాడుతూ 18 ఏళ్ళు నిండిన వారు, గతంలో ఓటు హక్కు లేని వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.