హైదరాబాద్: 28°C
తెలంగాణ

పైప్‌లైన్‌ లీకేజీతో తాగునీరు వృథా

KNR: హుజూరాబాద్‌లో మిషన్‌ భగీరథ పైప్‌లైన్‌ పగిలి తాగునీరు రోడ్డుపై వృథాగా ప్రవహిస్తోంది. గురువారం బీసీ జేఏసీ నాయకులు లీకేజీ ప్రాంతాన్ని పరిశీలించి ఆందోళన వ్యక్తం చేశారు. భూగర్భ జలాలు అడుగంటిన సమయంలో నీటిని వృథా చేయడం సరికాదని పేర్కొంటూ, అధికారులు వెంటనే మరమ్మతులు చేపట్టాలని డిమాండ్‌ చేశారు.