MNCL: చెన్నూర్ పట్టణ గ్రంథాలయం తెరవడంలో సిబ్బంది అలసత్వం వహిస్తున్నారని విద్యార్థులు, పాఠకులు ఆరోపిస్తున్నారు. గురువారం ఉదయం 11 గంటలైనా గ్రంథాలయం తెరవకపోవడంతో పాఠకులు గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు స్పందించి పర్యవేక్షణ పెంచాలని, నిర్ణీత సమయానికి గ్రంథాలయం తెరిచేలా చర్యలు తీసుకోవాలన్నారు.
తెలంగాణ
ఉదయం 11 గంటలైనా తెరచుకొని గ్రంథాలయం


