హైదరాబాద్: 28°C
తెలంగాణ

పగుళ్లతో తహసీల్దార్ కార్యాలయం

MHBD:నర్సింహులపేట తహసీల్దార్ కార్యాలయ భవనం శిథిలావస్థకు చేరింది. 2001లో నిర్మించిన భవనం గోడలకు పగుళ్లు ఏర్పడగా, పైకప్పు పెచ్చులు ఊడిపడుతున్నాయి. వర్షాల సమయంలో పైకప్పుపై నీరు నిలవడంతో భవనం మరింత దెబ్బతింటోందని తెలుస్తోంది. దీంతో ఉద్యోగులు భయాందోళన మధ్య విధులు నిర్వహిస్తున్నారు. అధికారులు స్పందించి మరమ్మతులకు నిధులు కేటాయించాలని పలువురు కోరుతున్నారు.