PPM: సీతానగరం మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువారం ముడుపుల పూజలు నిర్వహించారు.వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరైనట్లు ఆలయ అర్చకుడు పీసపాటి శ్రీనివాసాచార్యులు తెలిపారు.స్వామివారు కోరిన కోర్కెలు తీర్చే ఇలవేల్పుగా దర్శనమిస్తున్నారని పేర్కొన్నారు. భక్తులు గోవింద నామస్మరణ చేస్తూ 27సార్లు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తారన్నారు.
ఆంధ్రప్రదేశ్
లక్ష్మీనరసింహస్వామికి ముడుపుల పూజలు


