హైదరాబాద్: 28°C
తెలంగాణ

అబ్దుల్ కలాం ఆశయాలు అందరికీ ఆదర్శం

RR: షాద్‌నగర్‌లో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మండల పరిషత్ కార్యాలయం వద్ద ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కలాం జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమని, ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ బసవేశ్వర్, కాంగ్రెస్ నాయకులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.