హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపు విద్యుత్ సమస్యలపై ప్రత్యేక సమావేశం

BHPL: విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం రేపు పైలట్ కాలనీలోని 33/11 కేవీ సబ్‌స్టేషన్‌లో సమావేశం నిర్వహించనున్నట్లు ఛైర్మన్ మాధవరావు తెలిపారు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగే సమావేశంలో రేగొండ, భూపాలపల్లి రూరల్, ఘనపూర్ సెక్షన్ల వినియోగదారులు విద్యుత్ బిల్లులు, మీటర్లు, కొత్త కనెక్షన్లు, సరఫరా అంతరాయాలపై ఫిర్యాదులు చేయవచ్చన్నారు.