హైదరాబాద్: 28°C
తెలంగాణ

గంధమల్లలో పర్యటించిన ఎమ్మెల్యే

BHNG: సమస్యల పరిష్కారానికి మార్నింగ్ వాక్ దోహదపడుతుందని MLA బీర్ల ఐలయ్య అన్నారు. తుర్కపల్లి మండలం గంధమల్లలో మార్నింగ్ వాక్ నిర్వహించారు. గ్రామంలోని ప్రధాన సమస్యలు, ప్రాజెక్టులో భూములు కోల్పోయిన వారికి నష్టపరిహారం, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పురోగతి, మౌలిక సదుపాయాలపై క్షేత్రస్థాయిలో పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు.