హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాష్ట్ర కన్వీనర్‌గా మహేందర్ రెడ్డి

KMR: తెలంగాణ రాష్ట్ర రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన్ కన్వీనర్‌గా గిరెడ్డి మహేందర్ రెడ్డి నియమితులయ్యారు. కామారెడ్డి జిల్లాలోని రామారెడ్డి మండలం పోసానిపేటకు చెందిన ఆయన కాంగ్రెస్‌లో సీనియర్ నాయకునిగా పనిచేస్తున్నారు. ఆయనను రాష్ట్ర కన్వీనర్‌గా నియమిస్తూ ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఉత్తర్వులు జారీ చేశారు.