హైదరాబాద్: 28°C
తెలంగాణ

పన్ను బకాయిదారులకు నోటీసులు

నల్గొండ: కార్పొరేషన్ పరిధిలోని 48 డివిజన్లలో రూ. 20 కోట్లకు పైగా ఉన్న ఆస్తి పన్ను బకాయిల వసూలుపై అధికారులు తీవ్ర దృష్టి సారించారు. రెండేళ్లుగా పన్ను చెల్లించని ప్రతి బకాయిదారుడికి ప్రత్యేక కార్యాచరణ ద్వారా రెడ్ నోటీసులు జారీ చేస్తున్నారు. పన్ను వెంటనే చెల్లించాలని హెచ్చరిస్తున్నారు.