MHBD: గంగారం మండలం అందుగులగూడెం ఐటీడీఏ ప్రాథమిక పాఠశాల రెండేళ్ల క్రితం విద్యార్థులు లేక మూతపడింది. తాజాగా పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో ఈ పాఠశాలకు రూ.10 లక్షలతో ప్రహరీ నిర్మాణం మంజూరైంది. పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు సిద్ధమవుతున్నారు. మూతపడిన పాఠశాలకు లక్షల నిధులు వెచ్చించడంపై స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తూ, అధికారులు స్పందించాలని కోరుతున్నారు.
తెలంగాణ
మూతబడిన పాఠశాలకు రూ.10 లక్షలతో ప్రహరీ


