ఛాతీ, పొట్ట మధ్య ఉండే డయాఫ్రమ్(ఉదరవితానం) కండరం అసంకల్పితంగా సంకోచించడం వల్ల మనకు ఎక్కిళ్లు వస్తాయి. ఆ సమయంలో స్వరపేటిక ఒక్కసారిగా మూసుకుపోయి 'హిక్' అనే శబ్దం వస్తుంది. ఆహారం హడావుడిగా తినడం, ఘాటైన కారం పదార్థాలు, కూల్ డ్రింక్స్ తీసుకోవడం, మానసిక ఒత్తిడి వల్ల ఇవి వస్తుంటాయి. వెంటనే చల్లని నీరు తాగడం లేదా కాసేపు శ్వాస బిగపట్టడం ద్వారా వీటిని సులభంగా తగ్గించుకోవచ్చు.
ఆరోగ్యం
ఎక్కిళ్లు వస్తున్నాయా? ఇలా చేయండి!


