హైదరాబాద్: 28°C
తెలంగాణ

అంగడిలో సీతాఫలాల విక్రయాల జోరు..!

జగిత్యాల జిల్లా కేంద్రంలోని అంగడి బజార్ లో గురువారం సీతాఫలాల విక్రయాల జోరు అందుకుంది. జిల్లా కేంద్రంతో పాటు వివిధ గ్రామాల నుంచి సీతాఫలాలను తీసుకువచ్చి పలువురు రైతులు సీతాఫలాలను విక్రయిస్తున్నారు. సీజన్‌లో లభించే సీతాఫలాలను కొనుగోలు చేసేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. దీంతో అంగడి బజార్‌లో సీతాఫలాల విక్రయాలు సందడిగా కొనసాగుతున్నాయి.