ASF: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఆవరణలో పాత డీఐసీ భవనంలో బుధవారం నిర్వహించిన సదరం శిబిరానికి సుమారు 130 మంది స్లాట్ బుక్ చేసుకున్నారు. భవనానికి ర్యాంపు లేకపోవడంతో వృద్ధులు, దివ్యాంగులు మెట్లు ఎక్కేందుకు, దిగేందుకు ఇబ్బందులు పడ్డారు. కొందరు పాక్కుంటూ వెళ్లాల్సి వచ్చింది. అధికారులు స్పందించి అవసరమైన సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు.
తెలంగాణ
ర్యాంపు లేక వృద్ధులు, దివ్యాంగుల అవస్థలు


