MLG: ఏళ్లుగా గుంతలతో ప్రయాణికులకు నరకం చూపిస్తున్న వెంకటాపురం–చర్ల ఆర్అండ్బీ రహదారి పునరుద్ధరణకు రూ.44 కోట్లు మంజూరయ్యాయి. అబ్బాయిగూడెం నుంచి ఎదిరగుట్టల వరకు 14.5 కిలోమీటర్ల రహదారిని ఆధునికీకరించనున్నారు. టెండర్లు పూర్తికాగా, వారం రోజుల్లో పనులు ప్రారంభిస్తామని ఏఈ అవినాశ్ తెలిపారు.పనులు త్వరితగతిన పూర్తి చేసి రోడ్డు అందుబాటులోకి తీసుకు రావాలని ప్రజలు కోరుతున్నారు.
తెలంగాణ
వెంకటాపురం–చర్ల రహదారికి మహర్దశ


