NRML: కుభీర్లో ఏళ్ల క్రితం నిర్మించిన రక్షిత మంచినీటి ట్యాంకు శిథిలావస్థకు చేరింది. ట్యాంకుకు పగుళ్లు ఏర్పడటంతో పాటు సిమెంటు పెచ్చులు ఊడిపోయి ఇనుప చువ్వలు బయటపడ్డాయి. దీంతో ట్యాంకును శుభ్రం చేయడానికి పారిశుద్ధ్య కార్మికులు భయపడుతున్నారు. ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
తెలంగాణ
శిథిలావస్థకు చేరిన మంచినీటి ట్యాంకు


