ADB: పట్టణంలోని ఖానాపూర్ చెరువు కట్టపై గంజాయి సేవిస్తున్న ఖిల్లా కాలనీకి చెందిన మొహ్మద్ అయాన్ పై కేసు నమోదు చేసినట్లు టౌన్ సీఐ సునీల్ కుమార్ బుధవారం తెలిపారు. నిందితుడి వద్ద నుంచి 2 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు. యువకులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, గంజాయి విక్రయించినా, సేవించినా కఠిన చర్యలు తప్పవని సీఐ హెచ్చరించారు.
తెలంగాణ
గంజాయి సేవిస్తున్న యువకుడిపై కేసు నమోదు


