హైదరాబాద్: 28°C
తెలంగాణ

తుప్పుపట్టిన తూము షట్టర్లు

PDPL: సుల్తానాబాద్ పట్టణ శివారులోని గట్టెపల్లి రోడ్డుపై ఎస్సారెస్పీ డీ-86 కాలువకు ఉన్న తూము శిథిలావస్థకు చేరింది. తుప్పు పట్టడంతో షట్టర్లను తెరవలేకపోతున్నారని రైతులు చెబుతున్నారు. దీంతో అశోక్‌నగర్‌ శివారులోని పంటలకు సాగునీరు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే తూము షట్టర్లకు మరమ్మతులు చేపట్టి సాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరారు.