హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈనెల 22న నాంపల్లిలో అలయ్ బలయ్ కార్యక్రమం

HYD: నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ఈనెల 22న అలయ్ బలయ్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ తెలిపారు. ముఖ్య అతిథులుగా తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా, కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ హాజరుకానున్నట్లు వెల్లడించారు.