హైదరాబాద్: 28°C
తెలంగాణ

చించోలిలో ఉచిత కంటి వైద్య శిబిరం

NRML:సారంగాపూర్ మండలం చించోలి (ఎం)లో గురువారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు దుర్గామాత ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. కమిటీ ఆధ్వర్యంలో ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి సహకారంతో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. అవసరమైన వారికి వైద్యుల సూచనల మేరకు చికిత్స అందించనున్నారు. కంటి సమస్యలతో బాధపడుతున్న ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కమిటీ సభ్యులు కోరారు.