హైదరాబాద్: 28°C
క్రీడలు

టీ20ల్లో మేం చాలా శ్రమించాలి: స్మృతి మంధాన

వన్డే ప్రపంచకప్‌ గెలిచినా, టీ20 క్రికెట్‌లో భారత జట్టు ఇంకా చాలా కష్టపడాల్సి ఉందని కొత్త కెప్టెన్ స్మృతి మంధాన అన్నారు. జింబాబ్వేతో శుక్రవారం నుంచి మొదలయ్యే తొలి సిరీస్‌తో పూర్తి స్థాయి కెప్టెన్‌గా బాధ్యతలు చేపడుతున్న ఆమె.. వచ్చే ఏడాది వదోదర వేదికగా జరిగే తొలి మహిళల ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఈ టీ20లను సద్వినియోగం చేసుకుంటామని తెలిపారు.