KNR: వీణవంక మండలం నర్సింగాపూర్లో విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్ ఆంజనేయులుపై దాడి చేసి సెల్ఫోన్ ధ్వంసం చేసిన నలుగురికి బుధవారం రిమాండ్ విధించినట్లు ఎస్సై తిరుపతి తెలిపారు. ఈ నెల 2న ఎస్సీ కాలనీ రోడ్డుపై మద్యం తాగుతున్న వారిని వీడియో తీస్తుండగా దాడి చేసి విధులకు ఆటంకం కలిగించారు. దీంతో ఊకంటి వేణు, రుత్విక్, దాసారపు రామ్మోహన్, బోయిని అరవింద్లపై కేసులు నమోదు చేశారు.
తెలంగాణ
కానిస్టేబుల్పై దాడి.. నలుగురికి రిమాండ్


