హైదరాబాద్: 28°C
తెలంగాణ

మూడు రోజులుగా ఇంట్లోనే వృద్ధుడి మృతదేహం

SRCL: వేములవాడ కోనాయిపల్లికి చెందిన కొంకటి చంద్రయ్య (80) సోమవారం రాత్రి మృతిచెందాడు. ఆయనకు చెందిన ఇల్లు, ఎకరన్నర భూమి పంపకాల విషయంలో కుటుంబ సభ్యుల మధ్య వివాదం తలెత్తడంతో మూడు రోజులుగా అంత్యక్రియలు నిలిచిపోయాయి. గ్రామ పెద్దలు ప్రయత్నించినా సయోధ్య కుదరకపోవడంతో పోలీసులు జోక్యం చేసుకుని బుధవారం రాత్రి అంత్యక్రియలు జరిపించారు.