హైదరాబాద్: 28°C
తెలంగాణ

లీకేజీలతో కలుషితమవుతున్న తాగునీరు

MBNR: రాజాపూర్ మండలంలో రాఘవపూర్ నుంచి చొక్కంపేట మీదుగా దొండ్లపల్లి వరకు మిషన్ భగీరథ పైపుల లీకేజీలతో తాగునీరు కలుషితమవుతోందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఐదు గ్రామాల ప్రజలు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని, పలుమార్లు ఫిర్యాదు చేసినా పరిష్కారం కాలేదని తెలిపారు. ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి స్పందించి లీకేజీలకు మరమ్మతు చేయాలని కోరుతున్నారు.