హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రమాదకరంగా మారిన పాత రహదారి

KNR: శంకరపట్నం మండలం కొత్తగట్టు గ్రామశివారులోని తుమ్మనపల్లి దారిలో పాత రహదారి దెబ్బతిని ప్రమాదకరంగా మారింది. హుజూరాబాద్‌ నుంచి కరీంనగర్‌ వైపు వెళ్లే వాహనాలు నూతన జాతీయ రహదారిపైకి చేరే క్రమంలో రోడ్డు దెబ్బతినడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాహనాలు అదుపుతప్పి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.