హైదరాబాద్: 28°C
తెలంగాణ

షార్ట్‌సర్క్యూట్‌.. స్టార్టర్, బోరు మోటార్ వైరు దగ్ధం

HNK: భీమదేవరపల్లి మండలం మల్లారం గ్రామంలో విద్యుత్ ప్రమాదం తృటిలో తప్పింది. బుధవారం గ్రామానికి చెందిన కొమురయ్య పొలం వద్ద కెపాసిటర్ షార్ట్‌సర్క్యూట్ కావడంతో స్టార్టర్‌లో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన స్థానికులు విద్యుత్ అధికారులకు సమాచారం అందించడంతో వెంటనే సరఫరా నిలిపివేశారు. అయితే అప్పటికే రైతుకు చెందిన స్టార్టర్‌తో పాటు బోరు మోటార్ వైరు దగ్ధమయ్యాయి.