హైదరాబాద్: 28°C
తెలంగాణ

సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: SI

JN: రఘునాథపల్లి మండలంలోని గోవర్ధనగిరిలో మార్గదర్శి, ఆంజనేయ, గంగోత్రి స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఎస్సై భరత్ ఆధ్వర్యంలో బుధవారం డ్రగ్స్ దుష్ప్రభావాలు, సైబర్ నేరాల నివారణపై అవగాహన కల్పించారు. మాదకద్రవ్యాలకు అలవాటుపడి జీవితాలను నాశనం చేసుకోవద్దని, వాటికి దూరంగా ఉండాలని సూచించారు. అపరిచితుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, లింకుల విషయంలో జాగ్రత్తలు పాటించాలన్నారు.