హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లా సీఎస్‌బీ ఇన్‌స్పెక్టర్‌గా రఘుపతి

NZB: వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్‌గా పని చేసిన బి. రఘుపతి సీఎస్బీ ఇన్‌స్పెక్టర్‌గా బదిలీ అయ్యారు. ఇటీవల జరిగిన బదిలీల్లో భాగంగా ఆయన ఐజీ కార్యాలయానికి అటాచ్ అయ్యారు. బుధవారం నిర్వహించిన 14 మంది సీఐల బదిలీల్లో ఆయన్ను నిజామాబాద్ కమిషనరేట్ స్పెషల్ బ్రాంచ్(సీఎస్బీ) ఇన్‌స్పెక్టర్‌గా నియమిస్తూ మల్టీజోన్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.