హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘట్‌కేసర్ CI సస్పెండ్!

MDCL: ఘట్‌కేసర్ సీఐ బాలస్వామిపై సస్పెన్షన్ వేటు పడినట్లు తెలుస్తోంది. సివిల్ మ్యాటర్‌లో తలదూర్చడం, అవినీతి వ్యవహారాలు, విధి నిర్వహణలో అలసత్వంపై వచ్చిన ఫిర్యాదులపై మల్కాజ్‌గిరి సీపీ సుమతి ఆదేశాలతో చేపట్టిన విచారణలో అవన్నీ నిర్ధారణ కావడంతో ఆయన్ను సస్పెండ్ చేసినట్లు అంతర్గత సమాచారం. గతంలోనూ ఘట్‌కేసర్ సీఐగా పనిచేసిన అధికారి దసరా సమయంలోనే సస్పెండ్ కావడం గమనార్హం.