NLG: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా చేపడుతున్నట్లు తహశీల్దార్ పరశురాం, ఎంపీడీవో యాకూబ్ నాయక్ తెలిపారు. బుధవారం దోమలపల్లిలోని డబుల్ బెడ్రూం ఇళ్లను సర్పంచ్ శిల్ప సతీష్తో కలిసి సందర్శించారు. అక్కడ నివసిస్తున్న వారితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. గతంలో 75 ఇళ్లకు 300 మంది దరఖాస్తు చేసుకోగా, మూడు బృందాలతో విచారణ చేపడుతున్నట్లు వెల్లడించారు.
తెలంగాణ
పారదర్శకంగా ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక


