హైదరాబాద్: 28°C
తెలంగాణ

పొలాల్లో కొంగలు జట్టుగా.. రైతుకు సహాయంగా

GDWL: అలంపూర్ మండలంలోని కోనేరు, గొందిమల్ల తదితర గ్రామల్లో వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. అదేవిధంగా రైతులు పొలాల్లో పొగాకు, కంది, శనగల సాగులో నిమగ్నం అయ్యారు. ఈ క్రమంలో ఓ రైతు పొలంలో కూలీలు కలుపు తీస్తుండగా.. కొంగలు వారి వెనకాల పొలంలోని చీడపురుగులను ఆరగిస్తూ రైతుకు తన వంతు సహాయం చేస్తున్నట్లు ఉంది. ఇలా పొలంలో కొంగలు కనువిందు కనిపించాయి.