హైదరాబాద్: 28°C
తెలంగాణ

భర్త హత్య కేసులో భార్య సహా 10 మంది దోషులు

WGL: దుట్ట శ్రీనివాస్ హత్య కేసులో భార్య రమ్యశ్రీ సహా 10 మందిని వరంగల్ జిల్లా న్యాయస్థానం బుధవారం దోషులుగా నిర్ధారించింది. 2024 ఫిబ్రవరి 13న అత్తవారి ఇంటి వద్ద జరిగిన దాడిలో శ్రీనివాస్ మృతి చెందాడు. విచారణలో నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి వి.బి. నిర్మలాగీతాంబ నిందితులను దోషులుగా ప్రకటించారు. శిక్ష ఖరారుపై గురువారం వాదనలు జరగనున్నాయి.