హైదరాబాద్: 28°C
తెలంగాణ

పశువైద్యశాల పనితీరుపై రైతుల ఆగ్రహం

PDPL: మంథని ప్రభుత్వ పశువైద్యశాలలో వైద్య సేవలు సక్రమంగా అందడం లేదని పశుపోషకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పనిచేయాల్సిన సిబ్బంది మధ్యాహ్నం ఒంటిగంటకే వెళ్లిపోతున్నారని ఆరోపిస్తున్నారు. మందులు అందుబాటులో లేక పశువులకు సరైన చికిత్స అందడం లేదని వాపోతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి సిబ్బంది సమయపాలన పాటించేలా, చూడాలన్నారు.