హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు లలితా త్రిపురసుందరిగా అలంకరణ

GDWL: దేవీ నవరాత్రుల్లో భాగంగా నేడు దుర్గాభవానీ దేవి లలితా త్రిపురసుందరి దేవిగా దర్శనమిస్తారు. అమ్మవారు శ్రీచక్ర అధిష్ఠానశక్తిగా, పంచదశాక్షరీ మహామంత్రాధి దేవతగా భక్తులను అనుగ్రహిస్తున్నారు. శ్రీలక్ష్మీదేవి, శ్రీసరస్వతీదేవి సేవిస్తుండగా దర్శనమిస్తారు. పరమేశ్వరుడు మహాకామేశ్వరుడిగా, అమ్మవారు మహాత్రిపురసుందరీ దేవిగా పూజలందుకుంటున్నారు.