హైదరాబాద్: 28°C
వ్యాపారం

పెరగనున్న జీతాలు.. ఏ రంగంలో ఎక్కువంటే?

భారతీయ ఉద్యోగులకు గ్లోబల్ సర్వీసెస్ సంస్థ ఏఆన్(Aon) గుడ్ న్యూస్ చెప్పింది. 2026-27 ఆర్థిక సంవత్సరంలో దేశంలో ఉద్యోగుల జీతాలు సగటున 9.1 శాతం పెరిగే అవకాశం ఉందని తన వార్షిక సర్వేలో వెల్లడించింది. ముఖ్యంగా NBFC రంగంలో అత్యధికంగా 10.1 శాతం, ఇంధన రంగంలో 9.9 శాతం, రియల్ ఎస్టేట్, మౌలిక సదుపాయాల రంగాల్లో 9.8 శాతం వరకు వేతన పెంపు ఉండొచ్చని అంచనా వేసింది.